80 వేల ఎగువకు సెన్సెక్స్...! 20 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 445, నిఫ్టీ 144 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ సూచీలు ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 80 వేల ఎగువన ముగిసింది.సెన్సెక్స్ 445.29 పాయింట్ల లాభంతో 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ 144.95 పాయింట్ల లాభంతో 24,276 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 84.71 వద్ద ముగిసింది.